అక్టోబర్ 3 నుండి 13 వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటన..
అక్టోబర్ 3 నుంచి స్కూళ్లకు దసరా సెలవులు ఇస్తున్నట్లు మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు.ఉపాధ్యాయులు, పలు సంఘాల విజ్ఞప్తితో ఒకరోజు ముందుగానే సెలవులు ఇస్తున్నామని, OCT 13 వరకు సెలవులు ఉంటాయన్నారు.పాఠశాల విద్యపై ఆయన సమీక్షించారు.నవంబర్ 11న నేషనల్ ఎడ్యుకేషన్ డే ఘనంగా నిర్వహించాలని 14న మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.ప్రభుత్వ స్కూళ్లను బలోపేతం చేయాలని సూచించారు.