Site icon PRASHNA AYUDHAM

10 కోట్ల లిఖిత రామనామాలతో శ్రీరామునికి అభిషేకం

IMG 20250823 WA0038

10 కోట్ల లిఖిత రామనామాలతో శ్రీరామునికి అభిషేకం

శ్రావణమాసంలో 10 కోట్ల రామనామాలు భక్తుల లిఖనం

లక్షలాది మంది భక్తులు మహాయజ్ఞంలో పాల్గొనడం

తెలుగు రాష్ట్రాల నలుమూలల నుండి సమర్పితమైన నామాలు

అద్దాల మందిరంలో సీతారాములకు ప్రత్యేక పూజలు

రామనామమే జీవన సాఫల్యానికి మార్గమని రామకోటి రామరాజు

ప్రశ్న ఆయుధం ఆగష్టు 23గజ్వెల్:

శ్రావణమాసం ముగింపునాడు భక్తి తరంగాలు అలముకున్నాయి. శ్రీరామకోటి భక్త సమాజం ఆధ్వర్యంలో నిర్వహించిన 10 కోట్ల లిఖిత రామకోటి మహాయజ్ఞంలో లక్షలాది మంది భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో రామనామాలను లిఖించి సమర్పించారు.

ఈ అమృత రామనామాలను అద్దాల మందిరంలో సీతారాములకు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్థ అధ్యక్షుడు రామకోటి రామరాజు మాట్లాడుతూ –

“రామనామంలో ఉన్న మంత్రశక్తి మనలోని దుఃఖాలను తొలగించి ఆనందాన్ని ప్రసాదిస్తుంది. ప్రతిరోజు కొంత సమయాన్ని రామనామ లిఖనానికి కేటాయిస్తే సంసారసముద్రంలో నౌకను గట్టుకు చేర్చే శక్తి కలుగుతుంది” అని స్పష్టం చేశారు.రామనామం ఒక్కటే శాశ్వతమని, భక్తుల హృదయాల్లో ఆ నమ్మకాన్ని పెంపొందించడమే ఈ మహాయజ్ఞం లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.

Exit mobile version