Site icon PRASHNA AYUDHAM

మరో అలర్ట్.. రెండు గంటల్లో భారీ వర్షం

IMG 20250809 WA2969

మరో అలర్ట్.. రెండు గంటల్లో భారీ వర్షం

తెలంగాణ : హైదరాబాద్‌కు వాతావరణ శాఖ మరో అలర్ట్ జారీ చేసింది. మరో రెండు గంటల్లో నగరంలో భారీ వర్షం కురిసే అవకాశముందని అంచనా వేసింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా సిబ్బంది అప్రమత్తమయ్యారు. అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు సూచించారు. అలాగే రంగారెడ్డి, సంగారెడ్డి, యాదాద్రి జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని.. గంటకు 30-40 కి.మీ వేగంతో ఈదురు గాలులు వీస్తాయని పేర్కొంది….

Exit mobile version