చత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్

*చత్తీస్ ఘడ్ లో మరో భారీ ఎన్ కౌంటర్*

చత్తిస్ గడ్:మార్చి 25

వరస ఎన్ కౌంటర్లతో భారీగా కేడర్ ను కోల్పో తున్న మావోయిస్టులకు మరో భారీ ఎదురు దెబ్బ తగిలింది,ఛత్తీస్ ఘడ్ లో మంగళ వారం మరో భారీ ఎన్ కౌంటర్ జరిగినట్టు తెలుస్తుంది,ఈ ఎన్ కౌంటర్ లో ఐదుగురు మావోయి స్టులు మరణించినట్లు సమాచారం.

మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని పోలీసులు తెలిపారు. భద్రతాదళాలు, మావోయి స్టులకు మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో ఇప్పటి వరకూ ఐదుగురు మావో యిస్టులు మరణించినట్లు అధికారికవర్గాలు వెల్లడిం చాయి.

ఛత్తీస్ ఘడ్ ప్రాంతంలో గత కొంత కాలంగా మావోయి స్టుల కోసం కూంబింగ్ జరుగుతుంది. భద్రతా దళాలు అటవీ ప్రాంతంలో ముమ్మరంగా గాలింపు చ ర్యలు చేపట్టాయి. అయితే ఎండా కాలం కావడంతో పాటు తాగునీరు దొరకక మావోయిస్టులు మైదాన ప్రాంతాలకు వస్తుండటంతో ఇరు వర్గాల మధ్య ఎదురు కాల్పులు జరుగుతున్నా యి.

ఇటీవల కాలంలో మావోయి స్టులు దాదాపు ఎనభై మంది పైగానే మరణిం చారని పోలీసులు తెలిపారు. ఇంకా ఎదురు కాల్పులు కొనసాగుతున్నా యని తెలిసింది.

Join WhatsApp

Join Now