తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్..

తెలంగాణలో మరో జాబ్ నోటిఫికేషన్

IMG 20240913 WA0024

తెలంగాణలో ఉద్యోగాల జాతర సందడి నెలకొంది. ఓ వైపు ప్రభుత్వ ఉద్యో గాలకు జాబ్ క్యాలెండర్ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..వాటికి అనుగు ణంగానే నోటిఫికేషన్స్ రిలీజ్ చేసేందుకు చర్యలు ప్రారంభించింది. ఈ నెలలోపే 4వేలకు పైగా వైద్యారోగ్య శాఖలో ఖాళీ పోస్టులకు నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. ఇప్పటికే 35వేలకు పైగా ఉద్యోగా లను భర్తీ చేసిన ప్రభు త్వం..ఈ ఏడాది చివరి నాటికి మరో 35వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఈమధ్యే సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ ప్రభుత్వం నిరుద్యోగు లకు అండగా ఉంటుం దని..గత ప్రభుత్వం వలే కాకుండా..న్యాయ సమ స్యల లేకుండా ఉద్యోగాల భర్తీకి ప్రక్రియ పూర్తి చేస్తామని స్పష్టం చేసింది. ప్రభుత్వ ఉద్యోగాల కల్పన చేస్తూనే…మరోవైపు ప్రైవేట్ రంగంలోకూడా ఉద్యోగాలను కల్పిస్తోంది ప్రభుత్వం. జిల్లాల వారీగా ఉపాధి కార్యాలయంలో ఉద్యోగ మేళాలను నిర్వహిస్తు న్నారు. ప్రభుత్వ సంస్థలు, కాలేజీల్లో ఖాళీ పోస్టులను కాంట్రాక్ట్ విధానంలో భర్తీ చేసేందుకు నోటిఫికేషన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. తాజాగా మరో ఉద్యోగ ప్రకటన వెలువడింది. టీజీఎస్ ఆర్టీసీ తార్నాక నర్సింగ్ కాలేజీలో కాంట్రాక్ట్ ప్రాతిపాదికన పలు ఉద్యో గాలను త్వరలోనే భర్తీ చేయనున్నారు. ఈ మేరకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ విషయాన్ని పోస్టు చేశారు. 

 

ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫె సర్, ట్యూటర్ పోస్టులను భర్తీ చేసే అవకాశం ఉంది.ఈ పోస్టుల భర్తీకి ఈనెల 18న ఇంటర్వ్యూ జరుగుతోంది. ఉదయం 9 గంటల నుంచి ఈ ఇంట ర్వ్యూలు ఉంటాయి.

అర్హత గల ఉద్యోగార్థులు పూర్తి వివరాలకు 70750 09463, 88850 27780 సంప్రదించవచ్చని అని సజ్జనార్ పేర్కొన్నారు. ప్రొఫెసర్ పోస్టులకు దరఖా స్తు చేసుకునే అభ్యర్థులు నర్సింగ్ లో ఎమ్మెస్సీపూర్తి చేసి ఉండాలి..

దీంతోపాటు సంబంధిత పనిలో 12ఏండ్ల అనుభవం ఉండాలి. ఈ పోస్టులకు నర్సింగ్ పీహెచ్‌డీ పూర్తి చేసినవారికి అధిక ప్రాధాన్యం ఉంటుంది. నెలకు రూ. 50వేల జీతం ఉంటుందని నోటిఫికేషన్లో పేర్కొన్నారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునేవారు కూడా ఎమ్మెస్సీ నర్సింగ్ చేయడంతోపాటు 3ఏండ్ల పనిచేసిన అనుభవం ఉండాలని తెలిపారు.

Join WhatsApp

Join Now