సంగారెడ్డి/పటాన్ చెరు, నవంబర్ 19 (ప్రశ్న ఆయుధం న్యూస్): నిత్యం సమాజ సేవలో తమదైన స్థానాన్ని నిలబెట్టుకున్న ఎండీఆర్ ఫౌండేషన్ ఇప్పటి వరకు సుమారు 582 అనాధలకు అంత్యక్రియలు నిర్వహించారు. అలాగే ఎంతో మంది పేద, అభాగ్యులకు ఆర్థిక సహాయం, రేషన్ కిట్లు అందిస్తూ సేవలను కొనసాగిస్తోంది. ఈ సేవా కార్యక్రమాల భాగంగా బుధవారం ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి పృథ్వీరాజ్ ఆర్థిక సహకారంతో మరో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించారు. పటాన్ చెరు నూతన మార్కెట్ సమీపంలో చెత్త కాగితాలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్న ఒక వృద్ధురాలు కింద పడిన విషయం తెలిసిన స్థానికులు సమాచారం ఇవ్వడంతో, ఆమెను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఆమె మరణించగా, ఆ వృద్ధురాలికి సంబంధించిన వారు ఎవరూ ముందుకు రాకపోవడంతో, ఎండీఆర్ ఫౌండేషన్ ఆమెకు అంత్యక్రియలను బాధ్యతగా నిర్వహించారు.
మరో అనాధ శవానికి అంత్యక్రియలు నిర్వహించిన ఎండీఆర్ ఫౌండేషన్
Published On: November 19, 2025 8:55 pm