Site icon PRASHNA AYUDHAM

వైసీపీ పార్టీకి మరో షాక్

IMG 20240919 WA0257

అమరావతి:సెప్టెంబర్ 19

ఏపీలో జగన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆపార్టీ నేతలు ఒకరి తరువాత ఒకరు వైసిపి పార్టీ అధ్యక్షుడు జగన్ కు షాక్‌ల మీద షాక్‌లు ఇస్తున్నారు…

ఇప్పటికే పలువురు జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పారు. వారం క్రితం ఇద్దరు రాజ్యసభ సభ్యులు పార్టీకి రాజీనామా చేశారు. తాజాగా జగన్ సొంత బంధువు బాలినేని వైసీపీకి రాజీనామా చేయటంతో పార్టీకి భారీ షాక్ తగిలింది.

రాజీనామా బాటలోనే పలువురు సీనియర్ నేతలు ఉన్నట్టు తెలు స్తుంది. జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను సైతం వైసీపీకి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్టు తెలుస్తుంది.

త్వరలోనే జనసేనలో చేరేందుకు ఆయన ప్రయత్నాలు చేస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. వీరితో పాటు గుంటూరు, కృష్ణా, ప్రకాశం, నెల్లూరు జిల్లా నుంచి పలువురు నేతలు వైసీపీకి రాజీనామా చేసి కూటమిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది.

Exit mobile version