*అనుమతులు వేర్వేరు… నిర్మాణం మరో తీరు…*
-నిబంధనలను ఉల్లంగిస్తున్న నిర్మాణదారులు.
-పట్టించుకోని నిజాంపేట్ మున్సిపల్ అధికారులు.
-బాచుపల్లిలో అక్రమ నిర్మాణాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలి.
-ఎన్ఎంసి కమిషనర్ కు రమణి మాల్యాల ఫిర్యాదు.
*
నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయని పొందిన అనుమతులకు కడుతున్న అంతస్తులకు పొంతనే లేదని ఆశా ఉమెన్ నెట్వర్క్ అధ్యక్షురాలు రమణి మాల్యాల ఆరోపించారు.
మంగళవారం బాచుపల్లి సాయినగర్ సర్వే నెంబర్ 186 ప్లాట్ నెంబర్ 345, 344 నందు రెండు వేరువేరు అనుమతులు తీసుకొని ఒకే భవనంగా నిర్మించడమే కాకుండా జి ప్లస్ టు అనుమతులతో జి+5 అంతస్తుల అక్రమ నిర్మాణం, రోడ్డు ఆక్రమణపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రమణి మాల్యాల కమిషనర్ కు ఫిర్యాదు చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..బాచుపల్లి లోని సాయినగర్ సర్వే నెంబర్ 186, వార్డ్ నెంబర్ 345,344 నందు రెండు వేరువేరు అనుమతులు తీసుకొని ఒకే భవన నిర్మాణం చేయడం, జి+2 అనుమతులతో జి+5 అంతస్తుల అక్రమ నిర్మాణాలు, రోడ్డు ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ కు ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు. 300గజాల స్థలంలో ఐదంతస్తుల నిర్మాణం జరుగుతున్న మున్సిపల్ అధికారులు ఏ విధమైన చర్యలు తీసుకోకుండా అక్రమ నిర్మాణదారులకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అక్రమ నిర్మాణలతో ప్రభుత్వ ఆదాయాన్ని కోల్పోవడమే కాకుండా వాటిని కొనుగోలు చేసే ప్రజలు మోసపోయే ప్రమాదముందని హెచ్చరించారు. అక్రమంగా అనుమతులకు విరుద్ధంగా అంతస్తులు నిర్మిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని, భవనాన్ని సీజ్ చేయాలని డిమాండ్ చేశారు. అక్రమ నిర్మాణదారులపై చర్యలు తీసుకొని సరైన అనుమతులు తీసుకునే విధంగా ప్రోత్సహించడం వల్ల మున్సిపాలిటీకి ఆర్ధిక వనరులు చేకూరే అవకాశం ఉంటుందని సూచించారు.