Site icon PRASHNA AYUDHAM

ఇంకో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్..!

IMG 20250207 WA0047

*_ఇంకో వారం రోజుల్లో ఎన్నికల షెడ్యూల్_*

*_స్థానిక ఎన్నికలకు సమాయత్తం.._*

వేగంగా రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు

ఇప్పటికే పోలింగ్ కేంద్రాలు, బూత్ లు,బ్యాలెట్ బాక్స్ లు సిద్ధం కాగా,

తాజాగా ఎన్నికల నిర్వహణ పై మాస్టర్ ట్రైనర్లుకు శిక్షణ ప్రారంభం అయ్యింది.

మరోవైపు ఎన్నికల రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, పోలింగ్ సిబ్బందిని నియమించడానికి…

*_రాష్ట్ర ఎన్నికల సంఘం ,జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీచేసింది._*

*_పోలింగ్ సిబ్బందిని ఎంపిక చేయండి…_*

గ్రామ పంచాయితీలు,ఎంపీటీసీ,జడ్పీటిసి ఎన్నికల నిర్వహణ కోసం రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు, ఇతర సిబ్బందిని ఎంపిక చేయాలని ఎన్నికల సంఘం బుధవారం కలెక్టర్లను ఆదేశించింది. సిబ్బంది సంఖ్యను ప్రామాణికంగా తీసుకొని ఒకటి లేదా రెండు దఫాల్లో ఎన్నికల నిర్వహణకు అవకాశం ఉందని తెలిపింది.

*_11 వ తేదీన కలెక్టర్లతో సమావేశం.._*

ఎన్నికల నిర్వహణ పై రాష్ట్ర ఎన్నికల సంఘం ఈ నెల 11న అన్ని జిల్లాల కలెక్టర్లుతో సమావేశం నిర్వహించనుంది.అప్పటి లోగా ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ చేసే పనిలో అధికారులు….

Exit mobile version