**యాంటీ కరప్షన్ కమిటీ తెలంగాణ అబ్జర్వర్ గా దన్నారపు రాజలింగం నియామకం**
కామారెడ్డి జిల్లా బిక్కనూర్
(ప్రశ్న ఆయుధం) జులై 12
భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన దన్నారపు రాజలింగం, యాంటి కరప్షన్ కమిటీ లో ప్రమోషన్ పై తెలంగాణ అబ్జర్వర్ గా నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయనకు ముంబైలోని ఎసిసి జాతీయ కార్యాలయంలో యాంటీ కరప్షన్ జాతీయ అధ్యక్షులు రవీంద్ర త్రివేది ఆయనకు నియామక పత్రం అందజేశారు. యాంటీ కరప్షన్ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ అలోక్ త్రివేది తెలంగాణ అబ్జర్వర్ గా ఐడి కార్డు అందజేశారు. యాంటీ కరప్షన్ కమిటీ ఆదేశాలకు అనుగుణంగా పనిచేస్తూ ప్రజలకు ఉపయోగపడే పనులు చేయాలని ఆదేశించారు. తెలంగాణలో అవినీతి నిర్మూలనకు పనిచేయాలని సూచించారు. ఈ సందర్భంగా తెలంగాణ యాంటీ కరప్షన్ కమిటీ అబ్జర్వర్ గా ఎన్నికైన రాజలింగం మాట్లాడుతూ ఏసిసి కమిటీ అప్పగించిన పనిని సమర్థవంతంగా నిర్వహించి అవినీతి నిర్మూలనకు అహర్నిశలు కృషి చేస్తానన్నారు. ఈ పదవి అప్పగించిన పెద్దలకు ధన్యవాదాలు తెలిపారు.