నిజామాబాద్‌లో యాంటీ డ్రగ్స్ అవగాహన కార్యక్రమం
యువతలో చైతన్యం కలిగిస్తున్న యాంటీ డ్రగ్ సోల్జర్లు
, : యాంటీ డ్రగ్స్ కల్తీ కల్లుకు వ్యతిరేకంగా అవగాహన కల్పించేందుకు తెలంగాణ యాంటీ డ్రగ్స్ విభాగం చేపట్టిన ప్రచార కార్యక్రమంలో భాగంగా, ఇంపాక్ట్ ఇంటర్నేషనల్ సంస్థకు చెందిన యాంటీ డ్రగ్ సోల్జర్ కోటగిరి గంగా ప్రసాద్ పాల్గొన్నారు.
సందర్భంగా మాట్లాడుతూ,కల్తీ కల్లు, డ్రగ్స్ వాడకానికి లోనయినప్పుడు సంభవించే దుష్పరినామాల గురించి యువతతో పాటు ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమాన్ని నిజామాబాద్‌లోని మిర్చి కాంపౌండ్, దుబ్బా తదితర ప్రాంతాల్లో నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో యాంటీ నార్కోటిక్స్ బృందం కూడా పాల్గొని, డ్రగ్స్ మానవ జీవనంపై చూపే ప్రభావాలను వివరించారు. యువతను ఈ విషపూరిత వ్యసనాల నుండి దూరంగా ఉంచడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు.