జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి..

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తా

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి

నియామక పత్రం అంద జేసిన మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి..

IMG 20241010 WA00641

జిల్లా గ్రంథాలయ అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ అంతిరెడ్డి రాజిరెడ్డి అన్నారు. నాపై నమ్మకం ఉంచి ఈ పదవి బాధ్యతలు అప్పజెప్పినం దుకు అధిష్టానానికి, రాష్ట్ర నాయకులకు, మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో కీలకంగా పని చేసిన జిల్లా లోని సీనియర్ పార్టీ నేతల ను నామినేటెడ్ పదవులు వరిస్తున్నాయి. జిల్లా గ్రంథా లయ సంస్థ చైర్మన్ గా అంతి రెడ్డి రాజారెడ్డిని ప్రభుత్వం నియమించినట్లు ఉత్తర్వు లు జారీ చేసిన విషయం విధి తమే. గురువారం హైదరా బాదులో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా అంతిరెడ్డి రాజారెడ్డికి మాజీమంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి నియామకపత్రం అంద జేశారు. ఈ సందర్భంగాజిల్లా గ్రంథాలయ చైర్మన్అంతిరెడ్డి రాజా రెడ్డి మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీ కోసం కృషి చేశానని చెప్పారు. కష్టపడి పని చేసే వారికి కాంగ్రెస్ పార్టీలో గుర్తింపు తప్పకుండా ఉంటుందని అందుకు నా పదవే నిదర్శ నమని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక కృషి చేస్తుందని అన్నారు. కాంగ్రెస్ తోనే ప్రజా సంక్షేమమని అన్నారు.

Join WhatsApp

Join Now