జర్నలిస్ట్స్ హౌసింగ్ అండ్ హౌస్ సైట్స్ కమిటీ మెంబర్ గా అన్వర్ హుస్సేన్

సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబరు 17 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ స్టేట్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టుల కార్యవర్గ సమావేశం హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ యూనియన్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌ అలీ అధ్యక్షత వహించారు. ఈ సమావేశానికి తెలంగాణ రాష్ట్ర మీడియా అకాడమీ చైర్మన్‌ కె.శ్రీనివాస్‌రెడ్డి, దేవులపల్లి అమర్‌, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రాంనారాయణ, రాష్ట్ర నాయకులు, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హాజరయ్యారు. సమావేశంలో వివిధ రాష్ట్ర స్థాయి అనుబంధ కమిటీలను కార్యవర్గం ఆమోదించింది. సంగారెడ్డి జిల్లాకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ అన్వర్ హుస్సేన్ జర్నలిస్టుల హౌసింగ్ మరియు హౌస్ సైట్స్ రాష్ట్ర స్థాయి కమిటీలో సభ్యుడిగా నామినేట్ అయ్యారు. టీయూడబ్ల్యూజే రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.ఏ.కే.ఫైసల్, జిల్లా అధ్యక్షుడు యాదగిరి, జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణు తదితరులు అన్వర్ హుస్సేన్‌ను అభినందించారు.

Join WhatsApp

Join Now