టూరిజం పాలసీకి ఆమోదం.. ఏపీ కేబినెట్‌ నిర్ణయాలివే

టూరిజం
Headlines in Telugu
  1. ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు
  2. టూరిజం పాలసీకి ఆమోదం: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు
  3. ఏపీ కేబినెట్: నూతన క్రీడా పాలసీ, డ్రగ్స్ నియంత్రణ పేరును మార్పు
  4. ఏపీ కేబినెట్: జ్యుడిషియల్ ప్రివ్యూ రద్దు, పంచాయతీ చట్ట సవరణ
  5. ఏపీ కేబినెట్ ఆమోదించిన కీలక నిర్ణయాలు, విలీనం నిర్ణయం

అమరావతి: సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన ఏపీ మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఏపీ టూరిజం పాలసీకి క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది..

పర్యాటక ప్రాజెక్టులకు పరిశ్రమ హోదా కల్పించే ప్రతిపాదనపై చర్చించి ఆమోదించింది. జ్యుడిషియల్‌ ప్రివ్యూ రద్దు బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఏపీ ఇన్‌ఫ్రా ట్రాన్స్‌పరెన్సీ యాక్ట్‌ 2019 రిపీట్‌ చేయాలని ప్రతిపాదించారు. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖలో స్థానిక సంస్థల్లో ఛైర్మన్లపై అవిశ్వాసం పెట్టే అంశంపై చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అవిశ్వాసం పెట్టే గడువును నాలుగేళ్ల నుంచి రెండేళ్లకి కుదిస్తూ చట్ట సవరణ చేశారు.

2024- 25 కొత్త క్రీడా పాలసీకి క్యాబినెట్లో ఆమోదం లభించింది. డ్రగ్స్ నియంత్రణ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్‌గా (ఎలైట్ యాంటీ నార్కటిక్ గ్రూప్‌గా) మారుస్తూ క్యాబినెట్ తీర్మానం చేసింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కోసం గృహ నిర్మాణ శాఖ చేసుకోనున్న ఒప్పందానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌ను ఏపీ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్‌లో విలీనం చేసేందుకు క్యాబినెట్ ఆమోదం లభించింది. ఏపీ టవర్స్ లిమిటెడ్‌కు చెందిన మూలధనం, ఆస్తులు, అప్పులు బదలాయిస్తూ ప్రతిపాదన చేశారు..

Join WhatsApp

Join Now

Leave a Comment