ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం..

క్యాబినెట్‌

ఏపీ సీఎం చంద్రబాబు క్యాబినెట్‌ సమావేశం ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ అమరావతి

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన కేబినెట్ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశంలో కీలకమైన వివిధ ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
ఇసుక సీనరేజ్ రద్దు నిర్ణయాన్ని కేబినెట్ ఆమోదించనుంది. ఆ మేరకు ఉచిత ఇసుక విధానానికి ప్రభుత్వం సవరణ చేయనుంది. దీపావళి నుంచి దీపం పథకం కింద ఉచిత వంట గ్యాస్ సిలిండర్ల పంపిణీ పథకం అమలు ప్రతిపాద నను మంత్రి మండలి అంగీకరించనుంది.
రాష్ట్రంలోని వివిధ దేవాలయాలకు పాలక మండళ్ల నియామకంలో చట్ట సవరణ బిల్లు కేబినెట్ ముందుకు రానుంది. పాలక మండలిని 15 నుంచి 17 మందికి పెంచే ప్రతిపాదనపై మంత్రులు చర్చించనున్నారు.
కొత్త రేషన్ కార్డుల జారీ, మార్గదర్శకాలపై చర్చించ నున్నారు. వాలంటీర్ల కొనసాగింపు, రేషన్ డీలర్ల నియామకం వంటి అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
అమరావతికి వరల్డ్ బ్యాంక్ నిధులతో పాటు తాజాగా హడ్కో 11 వేల కోట్లు ఇచ్చేందుకు అంగీకారం తెలిపిన నేపథ్యంలో చేపట్టాల్సిన ప్రాజెక్టులపై కేబినెట్ చర్చించనుంది. పోలవరం ప్రోగ్రెస్, త్వరలో పనుల ప్రారంభంపై చర్చించనున్నారు.

Join WhatsApp

Join Now