4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం

కౌన్సెలింగ్‌పై
Headlines :
  1. “ఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్ పై హైకోర్టు ఆదేశాలు”
  2. “విద్యార్థుల కోసం మరో విడత కౌన్సెలింగ్‌ నిర్వహించాలని హైకోర్టు”
  3. “అక్టోబర్ 30న సీఏ ఫౌండేషన్ ఫలితాలు విడుదల – ఐసీఏఐ ప్రకటన”
ఈఏపీ సెట్‌ 4వ విడత కౌన్సెలింగ్‌పై నిర్ణయం తీసుకోండి..’ అధికారులకు హైకోర్టు ఆదేశం

ఏపీలో ఇటీవల కురుసిన వర్షాలకు కొన్ని ప్రాంతాల్లో వరదలు సంభవించడం వల్ల.. ఆయా ప్రాంతాలకు చెందిన పలువురు విద్యార్ధులు AP EAPCET 2024 కౌన్సెలింగ్ లకు హాజరుకాలేకపోయారు. దీంతో నష్టపోయిన వారందరి కోసం మిగిలిపోయిన సీట్ల భర్తీకి మరోమారు కౌన్సెలింగ్ జరపాలని ఓ విద్యార్ధి తల్లి హైకోర్టులో వేసిన పిటిషన్ ను కోర్టు విచారించింది. హైకోర్టు ఈ వినతిపై పది రోజుల్లో తగిన నిర్ణయం తీసుకోవాలని ఏపీఈఏపీ సెట్‌-2024 కన్వీనర్‌తోపాటు ఇతర అధికారులను ఆదేశించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి రాజశేఖరరావు ఉత్తర్వులిచ్చారు. దీనిపై తదుపరి విచారణను 2 వారాలకు వాయిదా వేశారు.అక్టోబర్‌ 30న సీఏ ఫౌండేషన్‌, ఇంటర్‌ 2024 పరీక్షల ఫలితాలు.. ఐసీఏఐ ప్రకటనఐసీఏఐ సీఏ ఫౌండేషన్‌, ఇంటర్మీడియట్ పరీక్ష 2024 ఫలితాలు అక్టోబర్‌ 30న విడుదల చేయనున్నట్లు ఐసీఏఐ అధికారిక ప్రకటన వెలువరించింది. ఫలితాలు విడుదలైన తర్వాత అభ్యర్థులు ఐసీఏఐ అధికారిక వెబ్‌సైట్‌లో రోల్‌ నంబర్‌, రిజిస్ట్రేషన్‌ నంబర్‌ వివరాలు నమోదు చేసి ఫలితాలు చెక్‌ చేసుకోవచ్చని తెలిపారు. ఈ పరీక్షల ఫలితాల కోసం అభ్యర్ధులు ఎదురు చూస్తున్నారు.

 

Join WhatsApp

Join Now