Site icon PRASHNA AYUDHAM

ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,భౌతిక కాయానికి ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతుల నివాళి!

IMG 20250608 WA1883

*ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్,భౌతిక కాయానికి ఏపీ మంత్రి నారా లోకేష్ దంపతుల నివాళి!*

*హైదరాబాద్: జూన్ 08*

బిఆర్ఎస్ పార్టీకి చెందిన జూబ్లిహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ నివాసానికి వచ్చిన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, ఆయన సతీమణి బ్రాహ్మణి మాగంటి భౌతికాయానికి నివాళులర్పించారు…

అనంతరం లోకేష్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ మృతి దిగ్భ్రాంతికి గురిచేసిందని, గుండెపోటుతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆయన అకాల మరణం పొందడం బాధాకరమని అన్నారు. తెలుగుదేశం పార్టీతోనే మాగంటి గోపీనాథ్ రాజకీయ ప్రస్థానం మొదలైందన్నారు.

1982లో తెలుగుదేశం పార్టీలో చేరిన ఆయన 1985లో హైదరాబాద్ నగర తెలుగు యువత అధ్యక్షుడిగా పనిచేశారని అన్నారు. 2014లో టీడీపీ తరపున ఎమ్మెల్యేగా వరుసగా మూడు సార్లు విజయం సాధించి నియోజకవర్గ అభివృద్ధి, ప్రజాసంక్షేమం కోసం ఆయన కృషి చేశారని కొనియాడారు.

మాగంటి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తూ.. ఆయన కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజే స్తున్నానని అన్నారు.

Exit mobile version