సంక్రాంతి లోపు రోడ్లపై గుంతలను పూడ్చాలి.,!

రోడ్లపై
Headlines :
  1. సంక్రాంతికి ఏపీలో రోడ్ల గుంతల సమస్యకు చెక్
  2. మిషన్ పాత్ హౌల్ ఫ్రీ ఏపీ – రహదారుల అభివృద్ధి కార్యక్రమం ప్రారంభం
  3. రోడ్ల పునర్నిర్మాణం: సంక్రాంతి లోపు గుంతలు పూడ్చాలన్న సీఎం చంద్రబాబు

సీఎం చంద్రబాబు

సంక్రాంతి పండుగలోపు ఏపీ రాష్ట్రంలో ఉన్న అన్ని రోడ్లపై గుంతలను పూడ్చాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. శనివారం మిషన్‌ పాత్‌ హౌల్‌ ఫ్రీ ఏపీ (మిషన్‌ గుంతల్లేని ఏపీ) పేరుతో ఈరోజు అనకాపల్లి జిల్లా వెన్నెలపాలెంలో రోడ్ల గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్థన్‌ రెడ్డి, ఇతర అధికారులు పాల్గన్నారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ ౌ రౌడీ రాజకీయాలు వద్దు.. అభివఅద్ధి రాజకీయాలు కావాలని పిలుపునిచ్చారు. రహదారులు బాగుంటే వ్యాపారాలు బాగా జరుగుతాయన్నారు. సంక్రాంతి లోపు రోడ్లపై ఉన్న గుంతలన్నీ పూడ్చాలని అధికారులను ఆదేశించారు. గత సీఎం రహదారులపై ఈత కొలనులు ఏర్పాటు చేశారని విమర్శించారు. రాష్ట్రంలోని రోడ్లు నరకానికి మార్గాలుగా మారాయని, ఈ దుస్థితికి గత పాలకులే కారణం అని చంద్రబాబు ఆరోపించారు.

Join WhatsApp

Join Now