ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్..

ఉద్యోగుల బదిలీలకు ఏపీ సర్కార్ గ్రీన్ సిగ్నల్.

మొత్తం 15 శాఖల్లో బదిలీలకు అనుమతి.

ఆగస్ట్ 19 నుంచి 31 వరకు బదిలీల పై నిషేధం ఎత్తివేసిన ఏపీ సర్కార్.

IMG 20240817 WA0078

పురపాలక, రెవిన్యూ, పంచాయితీ రాజ్, గనులు, పౌర సరఫరాలు, ఇంజనీరింగ్ ఉద్యోగులు, అటవీ, రవాణా, దేవేదాయ శాఖ,పరిశ్రమలు, వాణిజ్య పన్నుల, విద్యుత్, స్టాంపుల రిజిస్ట్రేషన్ శాఖల్లో బదిలీలకు అనుమతి*

ఎక్సైజ్ శాఖలో సెప్టెంబర్ 5 నుంచి సెప్టెంబర్ 15వ తేదీ వరకు బదిలీలకు అనుమతి

ఉపాద్యాయ, వైద్యారోగ్య సిబ్బంది బదిలీలకు దూరం.

 

ఏపీ ఉద్యోగుల సాధారణ బదిలీల షెడ్యూల్ మరియు మార్గదర్శకాలతో ఉత్తర్వులు *G.O.Ms.No.75 Dated: 17.08.2024* విడుదల.

పాత 13 జిల్లాల ప్రాతిపదికన బదిలీలు జరుగును.

జులై 31 నాటికి ఒకే స్టేషన్ (గ్రామం / పట్టణం / నగరం) లో గరిష్టం ఐదేళ్లు అయితే తప్పనిసరి బదిలీ… మిగతా అందరూ జీరో సర్వీస్స్ పై రిక్వెస్ట్ బదిలీకి అర్హులు.

ఉద్యోగ సంఘాల నేతలకు బదిలీ ఒకే స్థానంలో తొమ్మిదేళ్ల వరకు మినహాయింపు.

19.08.2024 నుండి 31.08.2024 వరకు బదిలీలపై నిషేధం ఎత్తివేత.

01.09.2024 నుంచి మరలా బదిలీలపై నిషేధం.

గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగులకు కూడా బదిలీల్లో అవకాశం.

Join WhatsApp

Join Now