Site icon PRASHNA AYUDHAM

దివ్యాంగులకు క్షమాపణ చెప్పాలి

IMG 20240724 WA1670

దివ్యాంగుల సమాజానికి క్షమాపణ చెప్పాలి

ప్రశ్న ఆయుధం న్యూస్, జూలై 24, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా విజ్ఞాన్ వికలాంగుల సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చిప్ప దుర్గాప్రసాద్ మాట్లాడుతూ ఈనెల 21వ తేదిన స్మిత సభర్వాల్ ఐఎఎస్ ట్విట్టర్ వేదికగా కేంద్ర ప్రభుత్వ సర్వీస్ ఉద్యోగాల్లో దివ్యాంగులకు రిజర్వేషన్లు అవసరం లేదని వ్యాఖ్యానించడం సరికాదని అన్నారు. దివ్యాంగుల మనోభావాలను దెబ్బ తీసేవిధంగా మాట్లాడేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివ్యాంగులు సమాజంలో చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్నారని పేర్కొన్నారు. మనిషి అందంగా ఉండటం కాదు మనసు అందంగా ఉండాలని అన్నారు. దివ్యాంగుల ఆత్మగౌరవం కించపరిచే విధంగా మాట్లాడిన స్మిత సభర్వాల్ ని కేంద్ర ప్రభుత్వం స్పందించి 2016 దివ్యాంగుల చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సబ్ కమిటీ చైర్మన్ పంగ ఈశ్వర్, జిల్లా అధ్యక్షుడు గాడి నర్సింలు పాల్గొన్నారు.

Exit mobile version