Site icon PRASHNA AYUDHAM

నేడు రెబల్స్ కు బుజ్జగింపులు..

IMG 20251203 110920

Oplus_16908288

 *వేడెక్కిన రాజకీయాలు.!*

*జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరిగింది*

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, డిసెంబర్ 3 (ప్రశ్న ఆయుధం న్యూస్): నేడు నామినేషన్ల ఉపసంహరణ కాగా, పార్టీ అభ్యర్థులతో పాటు రెబల్స్ కూడా నామినేషన్లు వేయడంతో పలు గ్రామాల్లో గట్టి పోటీ నెలకొంది. అధికార, ప్రతిపక్ష నేతలు రెబల్స్ ను బుజ్జగించేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఈ సారి తప్పుకో భవిష్యత్తులో అవకాశం ఇస్తాం అంటూ ఒప్పించే ప్రయత్నాలు సాగుతున్నాయి. కొన్ని గ్రామాల్లో స్వతంత్రులు బలంగా ఉండటం రాజకీయ సమీకరణాలను మార్చుతోంది.

Exit mobile version