ఈనెల 13లోపు రైతుబీమాకు దరఖాస్తు చేసుకోవాలి
ఆదిలాబాద్ జిల్లా రైతులు, తమ కొత్త పట్టా పాస్‌బుక్‌లతో ఈనెల 13లోపు రైతుబీమా పథకానికి దరఖాస్తు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్ సూచించారు.
2024-25 సంవత్సరానికి సంబంధించి, జూన్ 5 వరకు కొత్త పాస్‌బుక్‌లు పొందిన రైతులు రైతుబీమా పథకం-2025 పాలసీలో చేరడానికి దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.
జిల్లాలోని 21 మండలాల్లోని 101 రైతువేదికల్లో ఏఈవోలు రైతుబీమా వివరాల నమోదు కార్యక్రమాన్ని చేపడతారని అధికారి పేర్కొన్నారు.