కామారెడ్డిలో మద్యం షాపుల దరఖాస్తులు 1449కు చేరిక
జిల్లాలో మొత్తం 49 షాపులకు దరఖాస్తుల రికార్ట్
రేపటివరకు అవకాశముందని ఎక్సైజ్ శాఖ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ప్రశ్న ఆయుధం బుధవారం (22.10.2025)
2025–2027 సంవత్సరాల మద్యం దుకాణాల లైసెన్స్‌లకు ఇప్పటివరకు మొత్తం 1449 దరఖాస్తులు వచ్చాయని జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు తెలిపారు.
కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్‌షాపులకుగాను 450 దరఖాస్తులు, దోమకొండ పరిధిలో 8 షాపులకుగాను 307, ఎల్లారెడ్డి పరిధిలో 7 షాపులకుగాను 226, బాన్సువాడ పరిధిలో 9 షాపులకుగాను 245, బీచుకుందా పరిధిలో 10 షాపులకుగాను 221 దరఖాస్తులు అందినట్లు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా మొత్తం 49 వైన్ షాపులకు 1449 దరఖాస్తులు వచ్చినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుదారులు రేపు (23-10-2025) సాయంత్రం వరకు దరఖాస్తు చేసుకునే వీలుందని హనుమంతరావు తెలిపారు.