నిజాంసాగర్ జవహర్ నవోదయ విద్యాలయంలో పదకొండవ తరగతి సీట్ల భర్తీ కోసం దరఖాస్తులు
కామారెడ్డి జిల్లా నిజాంసాగర్ (ప్రశ్న ఆయుధం) ఆగస్టు 08
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని ప్రజలకు ముఖ్య గమనిక, ఎంతో విలువైన ప్రకటన. మీ బిడ్డల్ని ప్రతిభా వంతులుగా తీర్చిదిద్ది, ప్రయోజకులను చేయాలని కలలు కనే వారికి, మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాలని పరితపించే తల్లిదండ్రులకు మరియు విద్యార్ధినీ విద్యార్థులకు “పి.యం.శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ” (నిజాంసాగర్, కామారెడ్డి) నందు 11 వ తరగతి (2025-26) MPC మరియు Bipc లో మిగిలి ఉన్న సీట్ల భర్తీ కొరకై ఆన్లైన్/ఆఫ్లైన్ దరఖాస్తులు కోరబడుచున్నవి.
ఈ క్రింది లింక్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. లేదా విద్యాలయానికి వచ్చి దరఖాస్తు ఫారంలో మీ వివరాలను రాసి(ఆదివారం కూడా) దరఖాస్తు చేసుకోగలరు అర్హత
ప్రవేశం కోరే అభ్యర్థులు కామారెడ్డి మరియు నిజామాబాదు జిల్లాలోని ప్రభుత్వ/ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో 2024- 2025 విద్యా సంవత్సరంలో 10వ తరగతిలో 60% తో
ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులు. దరఖాస్తుకు చివరి తేది: (10/08/2025) సాయంత్రం 4గంటల లోపు మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన చిరునామా:
పి. యం. శ్రీ జవహర్ నవోదయ విద్యాలయ.
నిజాంసాగర్, కామారెడ్డి.