మద్యం షాపుల దరఖాస్తులు 193కు చేరిక
కామారెడ్డి జిల్లాలో 49 వైన్ షాపుల కోసం భారీ స్పందన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి ( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 14
2025–2027 సంవత్సరాల మద్యం దుకాణాల కేటాయింపుల కోసం దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియలో కామారెడ్డి జిల్లాలో పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి. ఈ రోజు వరకు మొత్తం 193 దరఖాస్తులు అందినట్లు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్ బి. హనుమంతరావు తెలిపారు.
జిల్లాలోని వివిధ స్టేషన్ పరిధుల వారీగా దరఖాస్తుల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
కామారెడ్డి స్టేషన్ పరిధిలో 15 వైన్ షాపులకు 54 దరఖాస్తులు,
దోమకొండ స్టేషన్ పరిధిలో 8 షాపులకు 32 దరఖాస్తులు,
ఎల్లారెడ్డి స్టేషన్ పరిధిలో 7 షాపులకు 25 దరఖాస్తులు,
బాన్సువాడ స్టేషన్ పరిధిలో 9 షాపులకు 44 దరఖాస్తులు,
బీచుకుందా స్టేషన్ పరిధిలో 10 షాపులకు 38 దరఖాస్తులు వచ్చాయి.
మొత్తం 49 వైన్ షాపుల కోసం ఇప్పటివరకు 193 దరఖాస్తులు అందినట్లు ఎక్సైజ్ శాఖ అధికారులు తెలిపారు.బి. హనుమంతరావు జిల్లా ఎక్సైజ్ సూపరింటెండెంట్, కామారెడ్డి