ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలి

ప్రజల సమస్యలపై ప్రజావాణిలో వచ్చిన అర్జీలను పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్

 సోమవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజల సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ రోజు ప్రజావాణి లో 70 అర్జీలు రావడం జరిగాయని తెలిపారు. ఆయా దరఖాస్తుల పై ఆయా శాఖాధికారులు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో కొనసాగుతున్న సమగ్ర ఇంటింటి సర్వే పనులు పూర్తిచేయాలని, పూర్తిచేసిన డేటా ను ఆన్లైన్ లో అప్లోడ్ చేయాలని తెలిపారు. ఎలాంటి తప్పులు జరుగకుండా ఎన్యుమరెటరు సేకరించిన సమాచారాన్ని ఆన్లైన్ లో పొందుపరచాలని కలెక్టర్ తెలిపారు.మధ్యాహ్న భోజన పథకం, వసతి గృహాల్లో విద్యార్థులకు అందిస్తున్న ఫలహారం, భోజనం, సౌకర్యాలను అధికారులు పర్యవేక్షించాలని అన్నారు. జిల్లా, మండల స్థాయి అధికారులను ప్రతీ ఒక వసతి గృహానికి ఇన్చార్జి నియమించడం జరిగిందని తెలిపారు. ఆయా అధికారులు వారికి కేటాయించిన వసతి గృహానికి వెళ్లి విద్యార్థులకు అందిస్తున్న వాటిని పరిశీలించాలని తెలిపారు. వారి పర్యటనకు సంబంధించిన వివరాలు, ఫోటోలు గ్రూప్ లో పోస్ట్ చేయాలని తెలిపారు.ఈ ప్రజావాణిలో అదనపు కలెక్టర్లు శ్రీనివాస్ రెడ్డి, వి.విక్టర్, జడ్పీ సీఈవో చందర్ నాయక్, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment