ఒకే ఒక ఆర్టీఐ దరఖాస్తు

ఒకే ఒక ఆర్టీఐ దరఖాస్తు

సమాచారం RTI సమాచార హక్కు

సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని హైకోర్టులకు

73 ఏండ్ల స్వతంత్ర భారతంలో ఇదే తొలి దరఖాస్తు

పూర్తి వివరాలు అందజేయాలని ఆదేశాలు

ఓ విద్యార్థి సమాచార హక్కు చట్టం ద్వారా చేసిన దరఖాస్తు సుప్రీంకోర్టుతో సహా దేశంలోని అన్ని హైకోర్టులనూ కదిలించింది. ఆర్టీఐ అమల్లోకి వచ్చిన తర్వాత దేశంలో అన్ని న్యాయస్థానాలను కదిలించిన తొలి దరఖాస్తు ఇదే. 73 ఏండ్ల స్వాతంత్య్ర భారతదేశంలో నమోదయిన కేసులెన్ని తీర్పు వచ్చినవి, రానివి, ఎన్నేండ్లుగా పెండింగ్లో ఉన్నవి వంటి కీలక విషయాలపై ఈదరఖాస్తు చేశారు. వివరాల్లోకి వెళితే..

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్డుకు చెందిన విద్యార్ధి నల్లపు మణిదీప్ గత నెలలో సమాచార హక్కు చట్టం ద్వారా దేశంలోని అన్ని

న్యాయస్థానాల నుంచి సమాచారం కోసం ఓ దరఖాస్తు చేశాడు. దానిలో… స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి నేటి వరకూ సుప్రీంకోర్టు, హైకోర్టు, సీబీ సీఐడీ, ట్రిబ్యునల్స్, డిస్ట్రిక్ కోర్టులు… ఇలా దేశంలోని ప్రతి న్యాయస్థానంలో నమోదైన కేసుల వివరాలు, ఎన్ని కేసులు పెండింగ్లో ఉన్నాయి.. వంటి సమగ్ర వివరాలు కావాలని అడిగారు. అలాగే, కోర్టులో ఎన్నో ఏండ్లుగా కేసులు పెండింగ్లో ఉండటం వల్ల న్యాయం కోసం దేశంలో ప్రజలు ఎంతో ఎదురు చూస్తున్నారనీ, తీర్పులు ఆలస్యం అవడానికి గల కారణాలూ ఇవ్వవలసిందిగా సెక్షన్ 4(1) (C) (d) ద్వారా కోరారు. ఈ దరఖాస్తును స్వీకరించి స్పందించిన డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్, డిపార్ట్మెంట్ ఆఫ్ లీగల్ అఫైర్స్.. విద్యార్థి అడిగిన సమాచారం కోసం దేశంలోని అన్ని హైకోర్టులతో పాటు సుప్రీంకోర్టుకూ దరఖాస్తును ట్రాన్స్ఫర్ చేశారు. అవసరమైతే పూర్తి సమాచారం కోసం ఇతర శాఖలకు పంపించి ఇవ్వవలసిందిగా కోరారు.

సమాచార హక్కు చట్టం బలమెంతో తెలిసింది- మణిదీప్

ఒక్క దరఖాస్తు అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లడం చాలా ఆనందకరంగా ఉందన్నారు. చట్టంపై పూర్తి నమ్మకం ఏర్పడింది. పూర్తి వివరాలు రాగానే ప్రజలందరికీ తెలియజేస్తాను.

Join WhatsApp

Join Now

Leave a Comment