బూత్ లెవల్ ఏజెంట్లు నియమించండి
జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ సూచన
రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం
కామారెడ్డి జిల్లా ఇంచార్జ్
ప్రశ్న ఆయుధం నవంబర్ 12
కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్లో బుధవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆధ్వర్యంలో వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సమావేశంలో బూత్ లెవల్ ఏజెంట్ల (BLA) నియామకం, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్ (SIR) కార్యక్రమం, ఓటర్ అవేర్నెస్ మరియు ఎథికల్ ఓటింగ్ అంశాలపై సమగ్రంగా చర్చ జరిగింది.
జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ — ప్రతి రాజకీయ పార్టీ ప్రతినిధులు తమ పార్టీకి చెందిన బూత్ లెవల్ ఏజెంట్లను నియమించి, ఓటరు జాబితా సవరింపు ప్రక్రియలో చురుకుగా పాల్గొనాలని సూచించారు. ప్రతి అర్హత కలిగిన ఓటరు పేరు జాబితాలో ఉండేలా, తప్పులు లేకుండా సవరించేందుకు బూత్ లెవల్ ఏజెంట్లు సమన్వయం చేయాలని అన్నారు.
అలాగే ఓటర్లలో అవగాహన కల్పించేందుకు, ఓటు హక్కు పవిత్రతను కాపాడేందుకు, ఎథికల్ ఓటింగ్‌పై ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. యువత, మహిళలు, కొత్తగా అర్హత పొందిన ఓటర్లు తప్పనిసరిగా తమ పేర్లు ఎన్నికల జాబితాలో నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కోరారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ విక్టర్, వివిధ రాజకీయ పార్టీ ప్రతినిధులు, ఎన్నికల విభాగ అధికారులు తదితరులు పాల్గొన్నారు.