*ఎస్.ఎస్.డికి మహిళ అధ్యక్షురాలుగా నియామకం*
ప్రశ్న ఆయుధం మార్చి 14 : అంబేడ్కరైట్ ఉద్యమంలో నూతన అధ్యయనం
అంబేడ్కరైట్ ఆలోచనపరురాలైన రమణ కుమారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమతా సైనిక్ దళ్ (ఎస్.ఎస్.డి) మహిళా విభాగ అధ్యక్షురాలిగా విజయవాడ ప్రెస్ క్లబ్లో శుక్రవారం నియామక పత్రాలు అందజేశారు. ఏపీ భారతీయ బౌద్ధ మహాసభ, ఎస్.ఎస్.డి రాష్ట్ర అధ్యక్షులైన బేతాళ సుదర్శనం, ప్రధాన కార్యదర్శి యారం శ్యామ్ కుమార్ సంతకాలతో వారికి సంఘం సభ్యత్వం ఇచ్చి, ఎస్.ఎస్.డి బాధ్యతలు అప్పజెప్పారు. సమాజంలో సమానత్వం, సమన్యాయం, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం నిరంతరం పాటుపడుతున్న ఎస్.ఎస్.డి ఆంధ్రప్రదేశ్ మహిళా విభాగానికి రమణ కుమారిని అధ్యక్షురాలిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ప్రధానంగా సమాజంలో సర్వ స్త్రీజాతి హక్కులను కాపాడడం, అంబేడ్కర్ సిద్ధాంతాలను విస్తృతంగా ప్రచారం చేయడం, స్త్రీల సామాజిక, ఆర్థిక, రాజకీయ రంగాల్లో సమాన వాటా అవకాశాలను కల్పించేందుకు ఆమె శ్రమించనున్నారని ఈ సందర్భంగా వారు తెల్పారు. ఈశుభ సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన రమణ మాట్లాడుతూ తమకు అప్పజెప్పిన మహిళ విభాగాన్ని బలోపేతం చేయడానికి శాయశక్తులా కృషి చేస్తానని, స్త్రీజాతికి ఇంత పెద్ద గౌరవం బాధ్యత ఇచ్చినందుకు పెద్దలకు ఆమె కృతజ్ఞతలు తెల్పారు. అయితే ఏపీ వ్యాప్తంగా మహిళలకు అన్యాయాన్ని దోపిడీని ఎదుర్కొనే ధైర్యాన్ని కల్పించేందుకు ముందుండి నాయకత్వం వహిస్తానని ఆమె అన్నారు. ఈ మేరకు ఎస్.ఎస్.డి సభ్యులు, కార్యకర్తలు, మద్దతుదారులు రమణకు అభినందనల వర్షం కురిపించారు.