యోగా ఇన్స్ట్రక్టర్ గా ‘కస్తూరి శ్రీలేఖ’ నియామకం
కోరుట్ల పట్టణానికి చెందిన కస్తూరి శ్రీలేఖ యోగా ఇన్స్ట్రక్టర్ గా నియమితులయ్యారు. ఈ మేరకు సోమవారం ఆయుష్ విభాగం అధికారులు వినీత, రహ్మద్ ఆలీ, శ్రీనివాస్ లు కస్తూరి శ్రీలేఖకు నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా కస్తూరి శ్రీలేఖ మాట్లడుతూ ఐలాపుర్ ఆయుష్ ఆరోగ్య కేంద్రంలో యోగశిక్షణా తరగతులు నిర్వహస్తున్నట్లు తెలిపారు. ఐలాపుర్ పరిసర ప్రాంత ప్రజలు ఉచిత యోగశిక్షణా తరగతులను సద్వినియోగా చేసుకోవాలని కోరారు. యోగా నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్న వారు ఐలాపూర్ ఆయుష్ విభాగం ఆరోగ్యకేంద్రంలో సంప్రదించాలని కోరారు. యోగా ఇన్స్ట్రక్టర్ గా నియమించిన ఆయుష్ విభాగం అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.