తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ జిల్లా కన్వీనర్‌గా ముబారక్ పూర్ గిరి నియామకం

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, నవంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌ సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌ ముబారక్‌పూర్‌ గిరి నియామకం అయ్యారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో జరిగిన ముఖ్య నాయకుల సమావేశంలో తెలంగాణ జర్నలిస్ట్ యూనియన్‌కు సంబంధించిన నియామకాలపై నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బింగి స్వామి మార్గదర్శకత్వంలో ఉమ్మడి జిల్లాల అధ్యక్షుడు దేవులపల్లి ఎల్లయ్య అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో ముబారక్‌పూర్‌ గిరిని సంగారెడ్డి జిల్లా కన్వీనర్‌గా అధికారికంగా నియమించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… సంగారెడ్డి జిల్లాలో యూనియన్ బలోపేతం చేయడానికి, సంఘం విధానాలు, కార్యక్రమాలు మండల స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు సమర్ధవంతంగా అమలు చేయడానికి యూనియన్ పని పనిచేస్తుందని తెలిపారు. సమన్వయం, క్రమశిక్షణ, జర్నలిస్టుల అభ్యున్నతి లక్ష్యంగా నూతన కన్వీనర్ పని చేయాలని సూచించారు. అనంతరం గిరి మాట్లాడుతూ.. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండి సేవలు అందించేందుకు కట్టుబడి ఉంటానని అన్నారు. సభ్యుల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇస్తూ, జిల్లాను రాష్ట్రంలో ఆదర్శంగా నిలపడానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజ్గిరి అధ్యక్షుడు వలపు శ్రీనివాస్, ఉల్లిగడ్డల శివ కుమార్, మర్రి రాజేష్, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now