మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్ది కుమార్ నియామకం

*మండల కాంగ్రెస్ అధ్యక్షుడిగా పెద్ది కుమార్ నియామకం*

*అధిష్టానానికి సీనియర్ నాయకులకు కృతజ్ఞతలు చెప్పిన పెద్ది కుమార్*

*ఇల్లందకుంట జనవరి 5 ప్రశ్న ఆయుధం*

IMG 20250105 WA0093

పార్టీ మండల అధ్యక్షుడిగా ఇల్లందకుంట గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ మాజీ శ్రీ సీతారామచంద్రస్వామి దేవస్థానం చైర్మన్ పెద్ది కుమార్ ను నియమిస్తున్నట్లు కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానకొండూరు ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ నియామక పత్రాన్ని హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఒడిదల ప్రణవ్ చేతుల మీదుగా ఆదివారం రోజున పెద్ది కుమార్ కు అందజేశారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నిక కాబడిన ఇల్లంతకుంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పెద్ది కుమార్ మాట్లాడుతూ నాపై నమ్మకంతో మండల పార్టీ అధ్యక్షునిగా ఎన్నిక చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ కు

జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ కు ప్రత్యేక కృతజ్ఞతలని తెలియజేశారు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అధిష్టానం అనుసంధానంలో కృషి చేస్తానని మండల కాంగ్రెస్ నాయకులను కలుపుకొని ముందుకు వెళ్తానని ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ గ్రామ గ్రామాన పార్టీ అభివృద్ధికి రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలిచే విధంగా పార్టీ అభివృద్ధి చేస్తానని ప్రతి సీనియర్ కార్యకర్తను గుర్తించి వారి సూచనలను పరిగణలకు తీసుకొని మండల అభివృద్ధికి కృషి చేస్తానని పెద్ది కుమార్ తెలిపారు

Join WhatsApp

Join Now