ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఆర్ సి నవంబర్
షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్ సి హెచ్ పి ఎస్) పినపాక మండల కమిటీ సమావేశం మండల కేంద్రంలో జరిగింది.పురుషుల కమిటీ, మహిళా కమిటీలను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.షెడ్యూల్డ్ కులాల హక్కుల పోరాట సమితి (ఎస్సీ హెచ్ పి ఎస్)మండల కమిటీ కన్వీనర్ గా జాడి కిరణ్, కో కన్వీనర్ గా కొడాలి నాగేశ్వరరావు, సహాయ కన్వీనర్ గా దాసరి రవికుమార్. మహిళ కమిటీ కన్వీనర్ గా నల్ల కౌసల్య, కో కన్వీనర్ గా జాడి రాధా, సహాయ కన్వీనర్ గా మంద రాధా ల ను ఏకాగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కమిటీలను వ్యవస్థాపక అధ్యక్షులు బొమ్మెర శ్రీనివాస్ చేతుల మీదుగా కమిటీ పత్రాలను అందజేయడం జరిగినది. మండల కమిటీ సభ్యులుగా కోడి రెక్కల రమేష్, దర్శనాల నరసింహారావు, నక్క ప్రశాంత్, తాళ్లూరి చిన్న సైదులు, బోడ సర్వేశ్వరరావు, ముదిగొండ రామకృష్ణ, అంబోజు సాగర్, జాడి శ్రీనివాసు మొత్తం 11 మంది కమిటీ సభ్యులు అదేవిధంగా మహిళా మండల కమిటీ సభ్యులు బిల్లా రాధా, రామటంకి లక్ష్మి, కాళ్ళ లక్ష్మి, వంకాయల రాణి, కొండ గొర్ల రమాదేవి, మైపా కాంత 9 మంది మహిళ మండల కమిటీ ఏర్పడింది. అదేవిధంగా నియోజకవర్గ కమిటీలో సభ్యులుగా జిమ్మిడి సుమన్, కుమ్మరి వెంకటేశ్వర్లను నియమించడం జరిగింది. గౌరవ సలహాదారులుగా సోంపల్లి తిరుపతి, జాడి రాంబాబు, గద్దల వెంకటేశ్వర్లు,గోవర్ధన్ ,జిమ్మిడి సడలమ్మ తదితరులు ఉన్నారు.
షెడ్యూల్డ్ కులాల పినపాక మండల కమిటీల నియామకం
by Naddi Sai
Published On: November 9, 2024 8:32 pm
