Site icon PRASHNA AYUDHAM

ప్రజా ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం..

 

టూరిజం ప్లాజాలో ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా భవిష్యత్తు కార్యాచరణపై నిర్వహించిన సమావేశంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి వర్యులు  రాజనర్సింహ తో కలిసి పాల్గొన్న జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీ కాంతారావు ఈసందర్బంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతించారు.సుప్రీంకోర్టు తీర్పుకు అనుగుణంగా ఏబీసీడీ వర్గీకరణ అమలుపై అన్ని రాష్ట్రాల కంటే ముందుగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని.ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతోన్న ఉద్యోగ నియామకాల ప్రక్రియలో కూడా మాదిగ, మాదిగ ఉప కులాలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు చర్యలు చేపడుతామని, అవసరమైతే ఆర్డినెన్స్ తీసుకోస్తామని అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రకటించారని అన్నారు..ఎస్సీ వర్గీకరణ కోసం సీఎం చేసిన కృషి మరియు వారు ఇచ్చిన మద్దతుకు ధన్యవాదాలు తెలియజేశారు.రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి  ప్రజా ప్రభుత్వంలో మాదిగలకు సముచిత స్థానం కల్పించి న్యాయం చేస్తారని విశ్వాసం వ్యక్తం చేశారు.ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును క్షుణ్ణంగా పరిశీలించి అధ్యయనం చేసి దానిని వందకు వంద శాతం అమలు చేయడానికి ఒక రోడ్డు మ్యాప్ తయారు చేయాలని, దశాబ్దాల సమస్యకు ఒక రూపు తీసుకొచ్చి పరిపూర్ణం చేయాలని అన్నారు..దిశగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు..ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ , ఎమ్మెల్యేలు మందుల సామేల్ , కవ్వంపల్లి సత్యనారాయణ , వేముల వీరేశం , కాలే యాదయ్య , మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ మాదిగ సామాజికవర్గానికి చెందిన మేధావులు పాల్గొన్నారు..

Exit mobile version