విత్తనాల కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి

*విత్తనాల కొనుగోళ్లలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి*

*కొనుగోలు చేసిన విత్తనాలకు రసీదు తప్పనిసరి*

*మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్*

*జమ్మికుంట మే 6 ప్రశ్న ఆయుధం*

రైతులు విత్తనాల కొనుగోలులో తగిన జాగ్రత్తలు తీసుకోవాలనీ జమ్మికుంట మండల వ్యవసాయ అధికారి ఎండి ఖాదర్ హుస్సేన్ అన్నారు.జమ్మికుంట మండలంలోని బిజిగిరిషరీఫ్ క్లస్టర్ రైతు వేదిక పరిధిలో రాబోవు వానాకాలం సీజన్ కి సంబంధించి రైతులు పత్తి, వరి విత్తనాలు కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి మండల వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్ రైతులకు అవగాహన కల్పించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు విత్తనాలు కొనుగోలు సమయంలో తప్పనిసరిగా లైసెన్స్ కలిగిన డీలర్ల వద్దనుండి మాత్రమే కొనుగోలు చేయాలని కోరారు కొనుగోలు చేసిన ప్రతి విత్తనం ప్యాకెట్ కు తప్పనిసరి రసీదు తీసుకోవాలనీ లాట్ నెంబర్ వివరాలు ఉన్నా రసీదు ను పొందాలని తెలిపారు.అనధికారిక వ్యక్తుల నుంచి ఎలాంటి విత్తనాలు కొనుగోలు చేయరాదని తెలియజేశారు ఎట్టి పరిస్థితుల్లో లూస్ పత్తి విత్తనాలు కొనుగోలు చేయరాదనీ అన్ని బిజీ – II పత్తి విత్తనాల రకాలు దాదాపుగా ఒకే రకమైన దిగుబడి సామర్ధ్యాన్ని కలిగి ఉంటాయని రైతులు కేవలం కొన్ని రకాల పత్తి విత్తనాలు మాత్రమే అధిక దిగుబడి ఇస్తున్నాయని అపోహపడి వాటి కోసము బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేయరాదని సూచించారు పత్తి విత్తనాలు మే నెలలో వర్షాలు పడకముందే పెట్టడం వల్ల ఎండ తీవ్రతకు వాటి యొక్క మొలక సామర్థ్యం దెబ్బ తినే అవకాశం ఉందని సరైన వర్షాలు పడిన తర్వాత మాత్రమే రైతులు పత్తి విత్తనాలు వేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి ఖాదర్ హుస్సేన్, వ్యవసాయ విస్తరణ అధికారి మహేందర్ రైతులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now