పాల్వంచలో రూ 5.63 కోట్లతో రెండు సబ్ స్టేషన్ ల నిర్మాణానికి ఆమోదం

IMG 20240906 WA00011

కూనం నేని సాంబశివరావు. కొత్తగూడెం శాసనసభ్యులు 

కొత్తగూడెం: పాల్వంచ మండలంలోని శ్రీనివాసాకాలనీ, పాండురంగాపురం గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ల నిర్మాణానికి పరిపాలనా, సాంకేతిక ఆమోదం లబించించని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు* తెలిపారు. గురువారం అయన ఇందుకు సంబందించిన వివరాలు వెల్లడించారు. శ్రీనివాసకాలనీ, పాండురంగాపురంలో సబ్‌స్టేషన్‌లు ఏర్పాటు చేయడం వల్ల ఈ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరాలోని అంతరాయాలు తగ్గి, పెరుగుతున్న విద్యుత్ డిమాండ్‌ను తీర్చడం సులభతరం అవుతుందని తెలిపారు. శ్రీనివాస కాలనీ, పాండురంగాపురం గ్రామాల్లో 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ల ఏర్పాటుకు త్వరలో ప్రారంభం అవుతుందని, శ్రీనివాస కాలనీలో 5 ఎంవీఏ పవర్ నాలుగు ట్రాన్స్ఫార్మర్లు నాలుగు 11 కేవీ ఫీడర్లతో సబ్‌స్టేషన్‌ నిర్మించడం జరుగుతుందని, దీని ద్వారా వేంకటేశ్వర హిల్స్ కాలనీ, శ్రీనివాస కాలనీ, అయ్యప్పనగర్, మరియు పేటచెరువు ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించనుంది. ఈ ప్రాజెక్టు కోసం రూ. 2.19 కోట్ల నిధులు కేటాయించారని తెలిపారు. అదేవిధంగా, పాండురంగాపురంలో ఏర్పాటు చేయబోయే సబ్‌స్టేషన్‌ కోసం కూడా 5 ఎంవీఏ నాలుగు పవర్ ట్రాన్స్‌ఫార్మర్‌ 11 కేవీ ఫీడర్లతో పాటు పాండురంగాపురం, నర్సంపేట, ప్రభాత్‌నగర్, యెల్లందులపాడు ప్రాంతాలకు మెరుగైన విద్యుత్ సరఫరా అందించేందుకు రూ. 3.43 కోట్ల నిధులు కేటాయించారని, మొత్తం రెండు సబ్స్టేషన్ల నిర్మాణానికి రూ.5.63 కోట్లు నిధులు మంజురైయ్యానని తెలిపారు.

Join WhatsApp

Join Now