ప్రతిభపరీక్షలు మార్గదర్శగా నిలుస్తాయి..!

ప్రతిభ పరీక్షలు మార్గదర్శిగా నిలుస్తాయి

కాండ్రేగుల వెంకటరమణ

 

అనకాపల్లి : ప్రభుత్వ ఉద్యోగాల పోటీ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు ప్రతిభ పరీక్షలు (టాలెంట్‌ టెస్ట్‌లు) మార్గదర్శిగా నిలుస్తాయనిశ్రీ గౌరీ గ్రంథాలయ కార్యదర్శి కాండ్రేగుల వెంకటరమణ పేర్కొన్నారు. శ్రీ గౌరీ గ్రంథాలయంలో ఆదివారం శ్రీధర్‌ సీసీఇ (కాలేజ్‌ ఫర్‌ కాంపిటేటివ్‌ ఎగ్జామ్స్‌) ఆర్‌ఆర్‌బీ, ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు ప్రతిభ పరీక్ష నిర్వహించింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నిరుద్యోగ పేద యువత సంక్షేమం కోసం శ్రీధర్‌ సీసీఇ నిర్వహించిన ప్రతిభ పరీక్షలో ఎంపికైన విద్యార్ధులకు ఉచిత శిక్షణ ఇవ్వనుందని చెప్పారు. గత 29 ఏళ్లుగా నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ ఉపాధికి దోహదపడిన శ్రీధర్‌ సీసీఇ త్వరలో ఆర్‌ఆర్‌బీ, ఎన్టీపీసీ పోటీ పరీక్షలకు ఇవ్వనున్న ఉచిత శిక్షణ తరగతులను విద్యార్ధులు, యువత సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఆర్ధిక ఇబ్బందుల వల్ల శిక్షణ పొందలేకపోతున్న గ్రామీణ, పేద విద్యార్ధులకు ఉచిత శిక్షణ చుక్కానిలా నిలుస్తుందని కాండ్రేగుల వెంకటరమణ అన్నారు. కార్యక్రమంలో శ్రీధర్‌ సీసీఇ డైరక్టర్‌ ఎ.అన్వేష్‌రెడ్డి, ప్రతినిధి కె.రమేష్‌ శ్రీ గౌరీ గ్రంథాలయ ప్రతినిధి కాండ్రేగుల అప్పారావు (కెప్టెన్‌) పాల్గొన్నారు. ప్రతిభ పరీక్షకు అనకాపల్లి, చోడవరం, ఎస్‌.రాయవరం, రావికమతం, రాంబిల్లి, అచ్యుతాపురం, కశింకోట, సబ్బవరం, చీడికాడ, యలమంచిలి మండలాల నుంచి 100 మందికి పైగా విద్యార్దులు హాజరయ్యారు.

Join WhatsApp

Join Now