నాగారంలో అక్రమ కట్టడాల మాఫియా..! అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.?

నాగారంలో అక్రమ కట్టడాల మాఫియా..! అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా.?

మేడ్చల్ జిల్లా నాగారం ప్రశ్న ఆయుధం సెప్టెంబర్ 03

నాగారం మున్సిపాలిటీలో అక్రమ కట్టడాల మాఫియా ప్రజల కళ్లముందే బీభత్సం సృష్టిస్తోంది. నిబంధనలను తుంగలో తొక్కి, భారీ భవనాలను నిర్మిస్తున్నా అధికారులు, రాజకీయ నాయకుల మద్దతుతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రజలు ఒకటే ప్రశ్న వేస్తున్నారు – “ఇది రాజకీయ నాయకుల ఒత్తిడా లేక టౌన్ ప్లానింగ్ సిబ్బందికి అందే మామూళ్ల మోతాదా?” ముఖ్యంగా 9వ వార్డులోని ఎస్‌.వి. నగర్ ప్రధాన రహదారిపై ఒక పాత భవనంపై అనుమతులకు మించి నిర్మాణం జరుగుతున్నా, మున్సిపల్ సిబ్బంది ఏమాత్రం పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు.

“మున్సిపల్ సిబ్బందికి ఇది కనిపించడం లేదా? లేక కళ్లు మూసుకున్నారా?” అంటూ స్థానికులు మండిపడుతున్నారు. ఈ అక్రమ కట్టడాలను వెంటనే కూల్చివేయాలని, వాటిని ప్రోత్సహిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ఉన్నతాధికారులు వెంటనే ఈ విషయంలో జోక్యం చేసుకోకపోతే, అక్రమ కట్టడాల మాఫియాకు అడ్డుకట్ట వేయకపోతే, రాబోయే రోజుల్లో ప్రజా ఆందోళన తప్పదని స్థానికులు హెచ్చరిస్తున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment