వేల సంవత్సరాల చరిత్ర కలిగిన దుర్గమ్మ గట్టును పట్టించుకునే అధికారులు లేరా

సామాన్య భక్తులకి మరియు మాల ధరించిన భక్తులు దర్శనానికి వెళ్ళాలంటే తప్పని తిప్పలు

కనీస సౌకర్యాలు కల్పించాలంటున్న ఆదివాసీ నాయకులు తంబల్ల రవి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేట నియోజకవర్గం దమ్మపేట మండలం గుర్రాయి గూడెం గ్రామ పరిధిలో ఉన్నటువంటి దుర్గమ్మ గట్టు వేల సంవత్సరాలు చరిత్ర గలగిన దేవాలయం,కాకతీయ కాలంనాటి దుర్గమ్మ గట్టు,ఆలయం ఒకప్పుడు భక్తులకి అనుకూలంగా బాగుండేది,ప్రస్తుతం నడకదారి కూడా సరిగా లేదు పిచ్చి రొట్టతో పూర్తిగా పేరుకు పోయి ఉన్నది,భక్తులు దర్శనానికి వెళ్లాలంటే ఏలాంటి విష సర్పాలు ఉంటాయో అనీ భయపడుతూ వెళ్లాల్సిన పరిస్థితి
ఏర్పడినది,కార్తీక మాసం సందర్భంగా మాలాలు ధరించిన భక్తులు దైవ దర్శనానికి వెల్లటానికి అష్ట కష్టాలు పడాల్సి వస్తుంది, ఎంతో చరిత్ర కలిగిన దేవాలయాన్ని అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు తేలవడం లేదని అని త్వరలో శివరాత్రి వస్తున్నది ముందు చూపుతో అధికారులు భక్తులకి సౌకర్యార్థం వాటర్ సౌకర్యం,మెటల్ రోడ్డు లేదా మట్టి రోడ్డు అయినా ఏర్పాటు చేయాలి,ఆదివాసి నాయకులు తంబళ్ల రవి తెలిపారు.

Join WhatsApp

Join Now