ఫోన్‌పే, గూగుల్‌ పే ఎక్కువగా వాడుతున్నారా.?

ఫోన్‌పే, గూగుల్‌ పే ఎక్కువగా వాడుతున్నారా.?

ఇన్ కం టాక్స్ నుండి నోటీసులు వస్తాయి జాగ్రత్తా..

*సంవత్సరం కి 10లక్షలు యూపీఏ ద్వారా లిమిట్ దాటితే నోటీసులు తప్పనిసరి అంటున్నారు టాక్స్ నిపుణులు*

డిజిటల్ పేమెంట్స్‌లో అత్యధికం యూపీఐ ద్వారానే జరుగుతున్నాయి. గూగుల్‌పే, ఫోన్‌పే, పేటీఎం ఇలా రకరకాల యాప్స్‌ను ఉపయోగిస్తున్నారు.

అయితే అంతా బాగానే ఉంది కానీ.. యూపీఐ యాప్స్‌ను ఎక్కువగా ఉపయోగించం వల్ల చిక్కుల్లో పడే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

ఎక్కువ మొత్తంలో యూపీఐ లావాదేవీలు చేసే వారిపై ఆదాయపు పన్ను విభాగం నిఘా పెడుతోంది. బ్యాంక్‌ అకౌంట్‌లో పరిమితికి మించి నగదు జమ కావడం, ఎక్కువ మొత్తంలో విత్‌డ్రా చేసుకున్న ఆదాయపు పన్ను దేశ అధికారులు నిఘా పెడుతున్నారు.

ఇలాంటి వారికి ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ నోటీసులు పంపించే అవకాశం ఉంది.

దీంతో పన్నులు, పెనాల్టీలు చెల్లించాలని అధికారులు నేరుగా ఇంటికి నోటీసులు పంపించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.

సాధారణంగా సేవింగ్స్‌ అకౌంట్‌లో ఒక ఏడాది రూ. 10 లక్షల లిమిట్ ఉంటుంది. ఈ లిమిట్‌ దాటితే వెంటనే వివరాలు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ విభాగానికి వెళ్తాయి. ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 285 బీఏ కింద బ్యాంక్ ఖాతాల్లో నగదు జమ చేసేందుకు పరిమితి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసే సమయంలో సేవింగ్స్ ఖాతాలో జమ అయిన డబ్బుల వివరాలు సరిపోలకపోతే మీకు ఐటీ శాఖ నోటీసులు జారీ చేస్తుంది.

Join WhatsApp

Join Now

Leave a Comment