పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన అరేఖపూడి గాంధీ

*పలు సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన అరేఖపూడి గాంధీ*

*ప్రశ్న ఆయుధం,జనవరి,05, శేరిలింగంపల్లి,ప్రతినిధి*

శేరిలింగంపల్లి డివిజన్ లో మౌలిక వసతుల కల్పనే లక్ష్యంగా రూ. 98 లక్షల వ్యయంతో శేరిలింగంపల్లి డివిజన్ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన..శిల్పా గార్డెన్స్, క్రాంతివనం మరియు NKR ప్రైడ్ కాలనీలలో నూతనంగా చేపట్టే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరేఖపూడి గాంధీ , శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ..శేరిలింగంపల్లి డివిజన్ అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నామని కాంగ్రెస్ పాలనలో క్రమక్రమంగా అభివృద్ధి చెందుతున్నాయని అన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ రాష్ట్రం దేశానికే దీక్షుచిగా మారిందన్నారు. ఈ కార్యక్రమంలో మియాపూర్ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్, చందానగర్ కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి, జిహెచ్ఎంసీ ఇంజనీరింగ్ సెక్షన్ డిఈ ఆనంద్, ఏఈ భాస్కర్, డివిజన్ అధ్యక్షులు రాజు యాదవ్, ప్రధాన కార్యదర్శి రవీందర్ గౌడ్, పురం విష్ణు వర్ధన్ రెడ్డి, గోపినగర్ బస్తీ అధ్యక్షులు గోపాల్ యాదవ్, సురభి కాలనీ ప్రెసిడెంట్ చంద్రశేఖర్, సయ్యద్ నయీమ్, కుటుంబరావు, రవికిరణ్, శిల్పా గార్డెన్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ రామ్ కిషోర్ యాదవ్, హరి, రామలింగేశ్వర రావు, సందీప్, సురేష్ బాబు, క్రాంతివనం అసోసియేషన్ ప్రెసిడెంట్ నర్సింహా రెడ్డి, మర్రి రెడ్డి, తిప్పన, ప్రకాష్ రెడ్డి, విఎన్ రెడ్డి, రాజశేఖర్, దీపక్ మరియు శ్రీనివాస్, మల్లేష్, విజయ్, పవన్, ఫకృద్దీన్, తదితర కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now