ఆర్ఫన్ (అనాధ పిల్లలకు)చిల్డ్రన్స్ కు ఆరోగ్యశ్రీ కార్డ్స్ అందజేత
కామారెడ్డి జిల్లా దోమకొండ
(ప్రశ్న ఆయుధం) జూలై 29
రాష్ట్ర శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ, ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లాలోని 105 మంది ఆర్ఫాన్ పిల్లలకు ఆరోగ్యశ్రీ కార్డులు పంపిణీ చేశారు. మంగళవారం దోమకొండ మండలంలొ రేషన్ కార్డులు పంపిణీ కార్యక్రమానికి హాజరైన సీతక్క,షబ్బీర్ అలీ, మాట్లాడుతూ జిల్లాలోని అనాధ పిల్లలకు 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ కార్డ్, ద్వారా లబ్ధి పొందవచ్చునని తెలిపారు. అలాగే పతి కుటుంబానికి సంవత్సరానికి వైద్యశాల ఐదు లక్షల నుండి 10 లక్షల పెంచిన గణత కాంగ్రెస్ ప్రభుత్వందే అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్,అదనపు కలెక్టర్ విక్టర్, చందర్, శిశు సంక్షేమ అధికారిని ప్రమీల,ఆరోగ్య శ్రీ జిల్లా ఇన్చార్జి టీమ్ లీడర్ అల్లావుద్దీన్, సిడిపిఓ స్రవంతి, తదితర అధికారులు, పాల్గొన్నారు.