అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని డిమాండ్
మనీష్
ప్రశ్న ఆయుధం నవంబర్ 21: కూకట్‌పల్లి ప్రతినిధి
రెండుసార్లు బిఆర్ఎస్ పార్టీ ఇచ్చిన బీఫామ్ పైన ఎమ్మెల్యేగా గెలిచి పదవులు అనుభవించిన అరికెపూడి గాంధీ ఏ పార్టీలో ఉన్నారో చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు మనీష్ డిమాండ్ చేశారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని ఆల్విన్ కాలనీ డివిజన్లో గత రెండు రోజుల క్రితం నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు ఎమ్మెల్సీ శంబిపూర్ రాజు హాజరయ్యారు. కార్యకర్తలకు అండగా ఉంటామని భరోసా ఇస్తూ బిఆర్ఎస్ కార్యకర్తలలో జోష్ నింపారు. వాటిని తట్టుకోలేక కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ లు పెట్టి ఎమ్మెల్యే ,ఎమ్మెల్సీ లను తిట్టడం సరైన పద్ధతి కాదన్నారు. ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు రాజకీయ ప్రస్థానం ఉండే మొదలై కౌన్సిలర్ నుండి వైస్ చైర్మన్ గా పదవులు చేపట్టేసి డివిజన్ ను అభివృద్ధి చేసిన ఎమ్మెల్యేను పిలిస్తే కాంగ్రెస్ నాయకులు ఓర్వలేకపోతున్నారని ,ఎమ్మెల్సీ శంబిపూర్ రాజును కించపరిచే విధంగా మాట్లాడడం దుర్మార్గమైన పని అని మనీశ్ అన్నారు. తెలంగాణ ఉద్యమం కోసం 365 రోజులు టెంట్ వేసుకొని దీక్షలు చేసిన శంబిపూర్ రాజు కేసీఆర్ తో పాటుగా ఉద్యమంలో పాల్గొని జైలుకు వెళ్లిన ఉద్యమకారుడిని తక్కువ చేసి మాట్లాడితే ఉద్యమకారులు ఊరుకోబోరని హెచ్చరించారు. అరికెపూడి గాంధీ టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నా కాంగ్రెస్ ఎమ్మెల్యే నా కచ్చితంగా ప్రజలకు తేల్చి చెప్పాలని తెలంగాణ ఉద్యమకారుడు మనీష్ అన్నారు.