*ఎమ్మెల్సీ కోదండరాంకి అభినందనలు తెలిపిన టీజేఎస్ నాయకురాలు అరికిల్ల స్రవంతి*
జమ్మికుంట ప్రశ్న ఆయుధం ఆగస్టు 18
గవర్నర్ కోటా ఎమ్మెల్సీగా ఎన్నికైన ఆచార్య ప్రొఫెసర్ కోదండరాంని టీజేఎస్ నాయకురాలు అరికిల్ల స్రవంతి హైదరాబాద్ లో ఆయన నివాసం కలిసి అభినందనలు తెలిపారు అనంతరం స్రవంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ రధ సారధి సకలజనుల ఆశజ్యోతి ఆచార్య కోదండరాం ని గవర్నర్ కోటా ఎమ్మెల్సీ గా ఎన్నుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు సోనియా గాంధీ రాహుల్ గాంధీ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్ర మంత్రి వర్గానికి ప్రత్యేక అభినందనలు తెలిపారు తెలంగాణ ఏర్పాటు లో కీలక భూమిక పోషించిన కోదండరాం కి గత కెసిఆర్ ప్రభుత్వం కనీసం గుర్తింపు కూడా ఇవ్వలేదని ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసిందని ఏ లక్ష్యం కోసమైతే తెలంగాణ ఏర్పడ్డదో ఆ ఆశయాలను తుంగలో తొక్కి పాలన సాగించాడని కెసిఆర్ కి వ్యతిరేకంగా పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారుడని కూడా చూడకుండా అనేక ఇబ్బందులకు గురిచేసిందని తెలిపారు తెలంగాణని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పడ్డ తరువాత మొదటిసారి అధికారంలోకి రాగానే ఉద్యమనాయకునికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి తెలంగాణ అభివృద్ధి కి బాటలు వేసిందని తెలంగాణలో గాడి తప్పిన పాలను సరిచేయాలని విద్యా వ్యవస్థ దారిలో పడాలంటే కోదండరాం కి మంత్రి వర్గంలో చోటు కల్పించి విద్యాశాఖ మంత్రి గా అవకాశం కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వానికి స్రవంతి విజ్ఞప్తి చేశారు.