*నూతన మున్సిపల్ కమిషనర్ ను మర్యాదపూర్వకంగా కలిసిన ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్..*
*– ఆర్మూర్ జర్నలిస్ట్ వర్కింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్.*
ప్రశ్న ఆయుధం(ఆర్మూర్ ఆర్.సి) డిసెంబర్18:
ఆర్మూర్ పట్టణ మున్సిపల్ కమిషనర్ గా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన శ్రావణి గారిని ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున మర్యాదపూర్వకంగా గురువారం కలిసి పుష్పగుచ్చం అందజేసిశారు. ఈ సందర్భంగా ఆర్మూర్ వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. ఆర్మూర్ పట్టణంలో నెలకొన్న సమస్యలను కమిషనర్ కు వివరించారు. ఇందులో భాగంగా వీక్లీ మార్కెట్ అధ్యక్షులు & మాదిగ మహాసేన సంఘ జిల్లా అధ్యక్షులు గంగాని స్వామి వారికి పుష్పగుచ్చం అందజేసి పట్టణానికి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆర్మూర్ జర్నలిస్ట్ వర్కింగ్ అసోసియేషన్ అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పట్టణంలో అనేక సమస్యలు నెలకొన్నాయని అట్టి సమస్యలను తమరు పరిష్కరించాలని కోరగా వారు సానుకూలంగా స్పందించి ఒక్కొక్కటిగా సమస్యలు పరిష్కరించే దిశలో పనులు జరుగుతాయని అన్నారు. అదేవిధంగా పట్టణ ప్రజలు పన్నులు సకాలంలో చెల్లించి మున్సిపల్ కు సహకరించాలని ప్రజలను కమిషనర్ కోరారు. కమిషనర్ మాట్లాడుతూ.. గ్రూప్స్ లో ఉద్యోగం సాధించి నేరుగా ఆర్మూరు పట్టణానికి మొదటి కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించడం జరిగిందని మున్సిపల్ కమిషనర్ పూజారి శ్రావణి తెలిపారు. కాగా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు సక్రమంగా కొనసాగుతాయని, మున్సిపాల్ సిబ్బందిని సహకరించాలని ప్రజలను, జర్నలిస్టుల ను కోరారు. వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ తరపున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పొన్నాల చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బొడ్డు గోపి కోశాధికారి దొండి సంతోష్, సభ్యులు నాగభూషణ్, బోడమిది నరేష్, వీక్లీ మార్కెట్ కమిటీ అధ్యక్షులు గంగాని స్వామి తదితరులు పాల్గొన్నారు.