*మాతృ మరణాల నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకోవాలి*
*జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్*
మహబూబాబాద్ :మంగళవారం కలెక్టరేట్ ఎన్ఐసి సమావేశ మందిరంలో జిల్లా వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ, మాతృ మరణాల నివారణపై *జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్*, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, ప్రోగ్రాం అధికారులు, ఏఎన్ఏం,ఆశ కార్యకర్తలు సంబంధిత సిబ్బందితో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు,
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో గర్భస్థ స్త్రీ శిశు మరణాలను తగ్గించాలని, సాధారణ ప్రసవాలను ప్రోత్సహించాలన్నారు, వైద్య చికిత్స నిమిత్తం ం వచ్చే వారికి క్షేత్రస్థాయిలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైద్య సేవలు అందించాలని సూచించారు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వారిగా సబ్ సెంటర్ల వారిగా వివరాలను గర్భిణీ స్త్రీల వివరాలు సేకరించాలని ప్రభుత్వ సూచనల ప్రకారం ముందస్తుగా రిజిస్ట్రేషన్ చేయించాలన్నారు, వారికి కావలసిన వైద్య సూచనలు సలహాలు అందిస్తూ హై రిస్క్ కేసులు ఉన్నట్లు అయితే సంబంధిత ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ కు రిఫర్ చేయాలన్నారు, వారు ఇచ్చే సూచనలు, మందులు వాడుతున్న విషయాన్ని సరి చూసుకోవాలన్నారు,
మెటర్నల్ మరణాలు జరగకుండా ముందస్తు ప్రణాళిక ప్రకారం వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తంగా ఉంటూ జిల్లాలో వైద్య సేవలు అందించాలని ఆయన సూచించారు,
ఈ సమావేశంలో డాక్టర్ రవి రాథోడ్ డిఎం అండ్ హెచ్ ఓ, డిప్యూటీ డి ఎం అండ్ హెచ్ ఓ ప్రమీల రావు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్ గూడూరు సూపర్డెంట్ డాక్టర్ వీరన్న హెచ్ ఓ డి ప్రొఫెసర్ గానకాలజిస్ట్ డాక్టర్ శ్రీవిద్య, ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సారంగపాణి డాక్టర్ సుధీర్ రెడ్డి డాక్టర్ నాగేశ్వరరావు డాక్టర్ లక్ష్మీనారాయణ డాక్టర్ శ్రవణ్ కుమార్, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర వైద్యులు డాక్టర్ సురేష్ డాక్టర్ మౌనిక డాక్టర్ జ్వేలిత డాక్టర్ విరాజిత డాక్టర్ ప్రవీణ్, ఓబిలిశెట్టి రామకృష్ణ, అనిల్, సంబంధిత ప్రాథమిక ఆరోగ్య కేంద్ర సూపర్వైజర్స్ సిస్టర్లు ఆశాలు తదితరులు పాల్గొన్నారు.