హైదర్ గూడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు 

హైదర్ గూడలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఏర్పాట్లు

సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద జాతీయ పతాక ఆవిష్కరణకు ప్రత్యేకదిమ్మ ఏర్పాటు

గ్రంథాలయం స్థాపనకు గ్రామస్తుల ఏకాభిప్రాయం

యువత మత్తుకు బానిస కాకుండా పుస్తకాల వైపు మలచాలన్న సంకల్పం

పార్టీలకతీతంగా నాయకుల ఐక్యత – గ్రామ అభివృద్ధికి ముందడుగు

హైదర్‌గూడలో గ్రంథాలయంతో జ్ఞాన జ్యోతి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ మండలంలోని హైదర్‌గూడ గ్రామంలో ఈసారి స్వాతంత్య్ర దినోత్సవాన్ని సాంస్కృతికంగా, జ్ఞానప్రధంగా జరుపుకోనున్నారు. ఆగస్టు 15న జరగబోయే జాతీయ పతాక ఆవిష్కరణ వేడుకను ఘనంగా నిర్వహించేందుకు గ్రామస్థులు సిద్ధమయ్యారు. సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ప్రత్యేకంగా దిమ్మ ఏర్పాటు చేసి, జెండా ఎగరవేతకు ఏర్పాట్లు పూర్తయ్యాయి.

వీటితో పాటు, గ్రామంలో ఒక నూతన గ్రంథాలయాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రజలు, నాయకులు కలిసి ముందుకొచ్చారు. ఇది కేవలం పుస్తకాల మంజీరంగా కాకుండా, యువతను మత్తు వ్యసనాల నుంచి దూరంగా ఉంచే సాధనంగా ఉండాలని గ్రామ పెద్దలు చెబుతున్నారు.

గ్రంథాలయంలో పోరాటయోధుల జీవిత చరిత్రలు, ఆరోగ్య సలహాలు, నాయకత్వ లక్షణాలపై పుస్తకాలు అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. యువతి యువకులకు మార్గదర్శకంగా ఉండేలా ఇది రూపుదిద్దుకోనుంది.

ఈ కార్యక్రమంలో కోలాన్ సుభాష్ రెడ్డి, నారగూడెం మల్లారెడ్డి, చిట్టిగారి నరేందర్, కాశీ విశ్వనాథ్ గౌడ్, నరసింహ, అశోక్, రమేష్, పెంటా రెడ్డి, సుధాకర్, శేఖర్ రెడ్డి, బాల్ రెడ్డి, హరినాథ్, కొండవీటి హరినాథ్, కొమురయ్య, జయేంద్ర రెడ్డి, మేడం మధుసూదన్, బాల సుబ్రమణ్యం తదితర గ్రామ నాయకులు, యువత పాల్గొన్నారు.గ్రంథాలయ ప్రారంభోత్సవం త్వరలోనే జరగనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.

Join WhatsApp

Join Now