నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – 13 కేంద్రాల్లో పరీక్ష, 4,336 మంది హాజరు: కలెక్టర్ గౌతమ్

*నీట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి – 13 కేంద్రాల్లో పరీక్ష, 4,336 మంది హాజరు: కలెక్టర్ గౌతమ్*

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్న ఆయుధం మే 3

ఈ నెల 4న జరగనున్న నీట్ (నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్) పరీక్షను ప్రశాంతంగా, సజావుగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మొత్తం 13 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశామని ఆయన పేర్కొన్నారు.

నీట్ పరీక్ష మధ్యాహ్నం 2.00 గంటల నుండి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. ఈ పరీక్షకు జిల్లా నుంచి 4,336 మంది అభ్యర్థులు హాజరుకానున్నారని ఆయన వెల్లడించారు. అభ్యర్థులను ఉదయం 11.00 గంటల నుండి మధ్యాహ్నం 1.30 గంటల వరకు పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారని, మధ్యాహ్నం 1.30 గంటలకు గేట్లు మూసివేయడం జరుగుతుందని కలెక్టర్ స్పష్టం చేశారు.

అభ్యర్థులు ఈ విషయాన్ని గమనించి, నిర్ణీత సమయానికి ముందే పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని కలెక్టర్ సూచించారు. చివరి నిమిషంలో కంగారు పడకుండా ఉండేందుకు ముందుగానే పరీక్షా కేంద్రాలకు చేరుకోవడం మంచిదని ఆయన హితవు పలికారు. పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ హాల్ టికెట్‌లో పేర్కొన్న నియమ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని కలెక్టర్ గౌతమ్ తెలిపారు.

Join WhatsApp

Join Now