అంతర్ రాష్ట్ర దొంగల ముఠా అరెస్ట్
– నేరాలకు ఉపయోగిస్తున్న మారణాయుధాలు స్వాధీనం
ప్రశ్న ఆయుధం – కామారెడ్డి
జాతీయ రహదారులపై, వివిద జిల్లాలలోని గ్రామలలో తాళం వేసిన ఇండ్లలో దోపిడీలకు పాల్పడిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సబ్యులు అరెస్టు రిమాండ్ కు తరలించినట్లు జిల్లా పోలీసులు ఒక ప్రకటనలో తెలిపారు. గత ఆరు నెలలుగా కామారెడ్డి, నిర్మల్, నిజామాబాద్ జిల్లాలలో , జాతీయ రహదారులపై జరుగుతున్న దారి దోపిడిలు, ఇండ్లలో దోపిడి విషయమై గాంధారి పోలిస్ స్టేషన్ లో Cr.No.83/2025 , 82 /2025 లలో కేసు నమోదు చేయడం జరిగిందనీ, ఇదే విధంగా పిట్లం, బీర్కూర్, సదాశివనగర్, మద్నూర్, తాడ్వాయి కామారెడ్డి జిల్లా కు సంబంధీచిన పోలిస్ స్టేషన్ల లో, నిజామాబాద్ జిల్లా కు సంబందించిన ఇందాలవాయి పోలిస్ స్టేషన్ లో, నిర్మల్ జిల్లాకు సంబంధీచిన టౌన్ పోలిస్ స్టేషన్ లో కేసులు నమోదు అయినవి. ఇట్టి నేరాలలో నిందితులు రహదారుల పై ఆగి ఉన్న వాహన దారులను లక్ష్యం గా చేసుకొని వారి పై మారణా ఆయుధా లతో దాడి చేసి దారి దోపిడి కి పాల్పడుతూ , రహదారులకి దగ్గరలో ఉన్న గ్రామాలలోని తాళాలు వేసి ఉన్న ఇండ్లను, ఇండ్లలో ఎవరైనా ఉన్నట్టు అయితే వారి పై మారణా ఆయుధా లతో దాడి చేసి ఇండ్లలో దోపిడీలు, దొంగతనాలు చేస్తున్నారు. ఈ కేసుల విషయములో కామారెడ్డి జిల్లా ఎస్పి యం. రాజేష్ చంద్ర ఐపిఎస్ ఉత్తర్వుల మేరకు డిఎస్పి ఎల్లారెడ్డి కేసులను చేధించుటకై 2 స్పెషల్ టీమ్ లను ఏర్పాటు చేయడం జరిగింది. 2 స్పెషల్ టీమ్ లలోని అధికారులు వారి వద్ద ఉన్న కొద్దిపాటి ఆధారాలకు సాంకేతిక పరిజ్ఞానం జోడించి దర్యాప్తును వేగవంతం చేశారు. సోమవారం ఉదయం మొండిసడక చౌరస్తా నందు గాంధారి పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా ముగ్గురు వ్యక్తులు రెండు ద్విచక్ర వాహనాలపై బాన్సువాడ నుండి గాంధారి వైపుకు వస్తు పోలీసు వారిని చూసి వారి వాహనాలను వదిలేసి పారిపోతుండగా గాంధారి పోలీసులు అట్టి ముగ్గురిని పట్టుకొని విచారించగా వారు నలుగురు సబ్యుల ఒక మూటగా ఏర్పడినారాని వారు గతంలో పలు నేరాలకు పాల్పడినట్లు తెలిపినారు. ప్రస్తుతం అంతరాష్ట్ర ముఠా లో (3) ముగ్గురు సభ్యులతో పాటుగా నేరానికి సంబండిచిన సొత్తును కొనుగోలు చేసిన వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి కోర్టు యందు హాజరుపర్చరూ.
పరారీలో ఉన్న ముఠాలోని ఇంకో సభ్యుడుని ఎటు భాస్కర్ చౌహాన్ ను త్వరలో పట్టుకుంటాం అన్నారు.
పార్థి ముఠా సభ్యుల నాందేవ్, కృష్ణ బాబు సిండే, రాథోడ్ అజిత్ రమేష్, గజానంద్ రామారావు అదే,
వీరిపై గతంలో మహారాష్ట్రలోని ఉద్గిరి రూరల్, నీలంగా పోలీస్ స్టేషన్లో హత్య , హత్యాయత్నం కేసులు నమోదు చేయబడ్డాయన్నారు. ముఠా సభ్యులలోని నలుగురు నిందితులను (A1,A3 to A5) లను గాంధారి పోలీసు స్టేషన్ 83 /2025 కేసులో సెక్షన్ 309 (4) బిఎన్ఎస్ (రాబరీ ) సెక్షన్ 25(1) ఏ ఆర్ ఎం ఎస్ యాక్ట్ యందు అరెస్టు చేయడం జరిగిందన్నారు. వీరిని కోర్టు ముందు హాజరుపరచడం జరుగుతుంది.
స్వాధీనం చేసుకున్న వాటి వివరాలు.
బంగారం ఆభరణాలు – 3 తులలు, వెండి ఆభరణాలు -12 తులలు, కత్తులు -02, ఇనుపరాడ్డు -01, టార్చి లైట్స్ -02, పనాలు -02, అడ్జస్టేబుల్ స్పానర్ -01,మొబైల్ ఫోన్స్ -03.
కేసు దర్యాప్తులో చాకచక్యంగా ప్రదర్శించిన సిసిఎస్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సదాశివనార్ సీఐ సంతోష్ కుమార్, SI లు ఆంజనేయులు, రంజిత్, ఉస్మాన్, హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, సిసిఎస్ సిబ్బంది అయిన గణపతి, శ్రీనివాస్, రాజేందర్, శ్రావణ్, లక్ష్మీకాంత్, స్వామి, మైసయ్య, రవి, మిగతా సిబ్బందిని జిల్లా ఎస్పీ యం. రాజేష్ చంద్ర, అడిషనల్ ఎస్పీ నర్సింహారెడ్డి అభినందించినారు.