గర్భిణీ మహిళను హత్య చేసిన నిందితులు అరెస్ట్
24 గంటలు గడవకముందే కేసును చేదించిన పోలీసులు
అతి తక్కువ సమయంలో కేసును చేదించిన సీఐ లక్ష్మీనారాయణ ఎస్ఐ క్రాంతి కుమార్ ను లను అభినందించిన పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం ఏసిపి
జమ్మికుంట ఇల్లందకుంట ఆగస్టు 31 ప్రశ్న ఆయుధం
శనివారం రోజున ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామంలో గర్భిణి మహిళను హత్య చేసిన నిందితులను అరెస్ట్ చేసి కోర్టుకు ఆదివారం రోజున హాజరు పరిచారు నిందితులు ఇల్లందకుంట మండలంలోని టేకుర్తి గ్రామానికి చెందిన ముద్రబోయిన రాములు కథలు చెప్పుకుంటూ జీవిస్తున్నాడు 20 సంవత్సరాల క్రితం రాములుకు కనగర్తి గ్రామానికి చెందిన రేణుకతో వివాహము జరగగా వారికి అభిలాష్, బన్నీ తేజ అను ఇద్దరు కుమారులు జన్మించారు రాములు కథలు చెప్పుకొని వరంగల్ కు వెళ్లి వస్తున్న క్రమంలో వరంగల్లో ప్రైవేటు ఉద్యోగం చేస్తున్న వివాహము అయిన చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన తిరుమలతో పరిచయం ఏర్పడి మొదటి వివాహము అయింది అని తెలుపకుండా ఎనిమిది సంవత్సరాల క్రితం ఆమెను రెండవ వివాహము చేసుకున్నాడు రెండవ భార్య అయిన తిరుమలను టీ కుట్టి గ్రామంలో వేరొక కాపురం పెట్టాడు రాములు మొదటి భార్యకు రెండవ వివాహము చేసుకోవడం ఇష్టం లేక తన కొడుకులకు తిరుమల పై కక్ష పెంచుకొని ఆమెతో తరచూ గొడవ పడుతూ ఉండేవారు రాములు కు రెండో భార్య తిరుమల కు గర్భం రావడం ఇష్టం లేని రాములు తన మొదటి భార్య కుమారులు తిరుమల పై కక్ష పెంచుకొని ఎలాగైనా చంపేయాలని నిర్ణయించుకొని రాములు చిన్న కుమారుడైన బన్నీ తేజ అదును చూసుకొని ఒంటరిగా ఉన్న సమయంలో తిరుమల పై కత్తితో విచక్షణావహితంగా తిరుమలకు గొంతు కోసి కత్తితో పొడిచి చంపేశాడు ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన ఇల్లంతకుంట పోలీసులు హుజురాబాద్ ఇన్చార్జి ఏసిపి శ్రీనివాస్ జీ ఆధ్వర్యంలో పారిపోతున్న నిందితులను పట్టుకుని అరెస్టు చేసి వారి నుండి నేరానికి ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీన పరచుకుని నిందితులను కోర్టులో హాజరు పరిచారు నేరం జరిగిన అతి తక్కువ సమయంలో చాకచక్యంగా వ్యవహరించి నిధులను పట్టుకున్న జమ్మికుంట రూరల్ సిఐ కె లక్ష్మీనారాయణ ను ఇల్లందకుంట ఎస్సై క్రాంతికుమార్ ను పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం అభినందించారు